సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలో తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో సాధారణ వ్యక్తిలా జీవనం గడుపుతున్నారు. రఘువీరారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చిరకాల లక్ష్యం గ్రామంలో దేవాలయ నిర్మాణం. సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు రఘువీరా దేవాలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రతి పనిని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మే 29న దేవాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవిని ఆహ్వానించారు.
మేస్త్రి అవతారమెత్తిన మాజీ మంత్రి - మాజీ మంత్రి రఘవీరా రెడ్డి వార్తలు
స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని నేతలందరూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రత్యర్థులను ఓడించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి రఘవీరా మాత్రం తెల్ల పంచె ధరించి, తలకు రుమాలు చుట్టుకుని మేస్త్రి పని చేస్తున్నారు.
ex minister raghuveera doing temple works in his village