అమరావతిలో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు బాధాకరమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న నారాయణస్వామిని తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో కలిసి సునీత పరామర్శించారు. నిరసన తెలిపిన తీరు, దానిపై పోలీసుల అనుసరించిన వైఖరిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపితే.. అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. రాష్ట్ర పోలీసులు ప్రతి చిన్నదానికీ కేసులు పెడుతూ తెదేపా శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమరావతిలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుబట్టారు. ఇలాంటి ఎన్ని చర్యలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
'చంద్రబాబు కాన్వాయ్ దాడి ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు బాధాకరం' - డీజీపీ వ్యాఖ్యలపై పరిటాల సునీత ఆగ్రహం
ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాన్వాయ్‌పై దాడి జరిగితే.. దానిపై డీజీపీ వ్యాఖ్యలు బాధాకరమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. దీనిపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు.
పరిటాల సునీత