ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా సానుభూతిపరులపై వివక్ష చూపితే.. ఆందోళన ఉద్ధృతం చేస్తాం' - ex minister palle raghunath reddy latest comments

అనంతపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, గ్రామ కార్యదర్శులతో మాజీ మంత్రి రఘునాథ్​ రెడ్డి చర్చించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని, తెదేపా సానుభూతిపరులు పట్ల నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. అర్హులైన లబ్ధిదారులతో కలిసి ఆయన ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

ex minister palle raghunath reddy
బాధితులతో కలిసి ధర్నా చేపట్టిన మాజీ మంత్రి పల్లె

By

Published : Jul 9, 2020, 8:09 PM IST

ప్రభుత్వ పథకాలకు అర్హులైన తెదేపా సానుభూతిపరుల పేర్లను వాలంటీర్లు నమోదు చేయకుండా వేధిస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద అర్హులైన లబ్ధిదారులతో కలిసి ధర్నా చేపట్టిన ఆయన.. గ్రామాల్లో వైకాపా నాయకులు ఆదేశాల మేరకు వాలంటీర్లు పని చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపాకి చెందిన అర్హులైన నిరుపేదల వివరాలను నమోదు చేయడం లేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించాల్సిన బాధ్యత అధికారులు, వాలంటీర్లపై ఉందని తెలిపారు. వివక్ష ఇలాగే కొనసాగిస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని రఘునాథ్​రెడ్డి హెచ్చరించారు. అయితే అందరికీ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని ఎంపీడీవో నరేష్ కృష్ణ హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు.

ABOUT THE AUTHOR

...view details