ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేరుశనగ రైతాంగాన్ని ఆదుకోవాలి: కాల్వ శ్రీనివాసులు - తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు

అనంతపురం జిల్లాలో నష్టపోయిన వేరుశనగ రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పంట ఏపుగా పెరిగినా... కాయలు ఏ మాత్రం లేవని అన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రకటన చేయాలని కోరారు.

ex-minister-kalava-srinivasulu
ex-minister-kalava-srinivasulu

By

Published : Aug 24, 2020, 7:08 PM IST

అనంతపురం జిల్లాలోని వేరుశనగ రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాయదుర్గంలో పర్యటించిన ఆయన... రైతులతో కలిసి వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.... వేరుశనగ మొక్కలు ఏపుగా పెరిగినా....పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.

మొక్కలకు పూత కూడా లేదని...రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి... ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి..పంట వివరాలను నమోదు చేయాలని కోరారు. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పంట నష్టంపై సీఎం జగన్ ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details