ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆధారాలన్నీ చూపుతున్నామని... ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పదవినుంచి తొలగిస్తారా లేదా అని... మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సీఎం జగన్ను ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి కర్ణాటక రాష్ట్రానికి పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటూ... వీడియో, ఫొటో ఆధారాలను కాలవ శ్రీనివాసులు మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
ఇసుక అమ్మకాల్లో అవినీతికి తావులేకుండా చేస్తామని ప్రకటనలు చేస్తున్న సీఎం జగన్... కాపు రామచంద్రారెడ్డిపై ఎలాంటి చర్య తీసుకుంటారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ... మరోవైపు తెదేపా కార్యకర్తలపై దాడులు చేయిస్తున్న రాయదుర్గం ఎమ్మెల్యేను కట్టడి చేయాలని ఆపార్టీ నేతలకు సూచించారు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు.