ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు శిరోధార్యం: కాలవ - ex minister kalava

ప్రజా తీర్పు శిరోధార్యమని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. కొత్త ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు.

kalava

By

Published : May 25, 2019, 10:26 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు శిరోధార్యం: కాలవ
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పందించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా పరిపాలన అందించాలని కాబోయే ముఖ్యమంత్రి జగన్​కు సూచించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నూతనంగా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఐదేళ్లుగా శ్రమించామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి దిశగా కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామన్న ఆయన.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని జగన్​ను కోరారు.

ABOUT THE AUTHOR

...view details