18 నెలల పాలనలోనే వైకాపా పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. తెదేపాను ఆడిపోసుకోవడానికే వైకాపా సభలు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. తప్పుడు హామీలు, మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి కార్యక్రమాలకు తెదేపా చేసిన శంకుస్థాపనలనే మరలా చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని కార్పొరేషన్లు ఏర్పాటుచేసి నిధులు కేటాయించకుండా కాలక్షేపం చేస్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తేదేపాతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఒక్క ఛాన్స్ అనే కారణంగా వైకాపాకు ప్రజలు అవకాశం ఇచ్చారని..,18 నెలల కాలంలోనే వైకాపా ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి మెుదలైందన్నారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు రావాలి జగన్-కావాలి జగన్ కాకుండా...పోవాలి జగన్-రావాలి చంద్రబాబు అని కోరుకుంటున్నారని తెలిపారు.