కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ నిర్వహణలో పోలీసులు చేస్తున్న సేవలను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు. అనంతపురం జిల్లాలో పోలీసులకు ఆయన నిత్యావసర వస్తువులు అందజేశారు.
ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని.. కరోనా నియంత్రణ కోసం మాస్కులు ధరించాలని ఆయన కోరారు. ఆరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు హోంగార్డులకు నిత్యవసర వస్తువులు, మాస్క్ లను పంపిణీ చేశారు.