ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లెక్కింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోండి' - అయ్యన్నపాత్రుడు వార్తలు

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని.. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అధికారులను కోరారు. ఈ మేరకు నర్సీపట్నం సబ్ కలెక్టర్​కి వినతి పత్రాన్ని సమర్పించారు.

ex minister ayyanna patrudu
ex minister ayyanna patrudu

By

Published : Mar 13, 2021, 7:52 PM IST

ఈ నెల 14న జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని... మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details