ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీగ వేరుశెనగ విత్తనాలు విత్తిన మాజీ మంత్రి దంపతులు - peanuts sowed news update

మొన్నటి వరకు సొంత ట్రాక్టర్​తో దుక్కి దున్ని వరి నాటిన మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి దంపతులు ఖరీఫ్ సీజన్​లో ఎద్దుల మడకతో తీగ వేరు శెనగ విత్తనాలు విత్తారు.

Breaking News

By

Published : Jun 14, 2020, 4:27 PM IST

తీగ వేరుశెనగ విత్తనాలు విత్తిన మాజీ మంత్రి దంపతులు

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామ సమీపంలో ఉన్న సొంత పొలంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు ఎద్దుల మడకతో తీగ వేరు శెనగ విత్తనాలు వేశారు. తీగ వేరుశెనగ కనుమరుగవుతున్న తరుణంలో అతికష్టం మీద ఓ రైతు నుంచి వీటిని సేకరించి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా రైతు పండించిన ప్రతీ పంట అధిక దిగుబడి రావాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details