అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. కూరగాయలు కొనేందుకు వచ్చే వారికోసం ప్రత్యేకంగా టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. అందులోంచి వచ్చిపోయే వారిపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. టన్నెల్‌ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి...ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరాన్ని పాటించటం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చని సూచించారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలి: ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి - ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తాజావార్తలు
ప్రతి ఒక్కరూ భౌతికదూరాన్ని పాటించాలని గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కరోనా నియంత్రణ టన్నెల్‌ను ఆయన ప్రారంభించారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలి