అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకోతపల్లి పరిధిలోని తెదేపా కార్యకర్త ప్రతి ఇంటా పండుగ వాతావరణం ఉండాలని 1000 కుటుంబాలకు పండుగ సరుకులు పంపిణీ చేశారు. తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పండుగకు ప్రతి ఇంట్లో చంద్రన్న కానుకలు పంపిణీ చేసేవారని పరిటాల శ్రీరామ్ తెలిపారు. స్థానిక తెదేపా కార్యకర్త శ్రీనివాసులు దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టి మండలంలోని వెయ్యి మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని... పరిటాల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని శ్రీరామ్ భరోసా ఇచ్చారు.
దీపావళి పండుగకు చంద్రన్న కానుక! - paritala sriram latest news in telugu
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకోతపల్లి పరిధిలో చంద్రన్న కానుకలు పంపిణీ చేశారు. పండుగా పూట ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని 1000 కుటుంబాలకు పండుగ సరుకులను పరిటాల శ్రీరామ్ అందించారు.
ప్రతి ఇంట పండుగ... శ్రీరామ్ అన్న కానుక