ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన అధికారులు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో లోతట్టు ప్రాంతాలు, చేనేత మగ్గాల్లోకి నీళ్లు వెళ్లడంపై ఈటీవీ, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. నష్టం విలువ అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు.

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

By

Published : Oct 11, 2020, 6:57 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చేనేత మగ్గాల్లోకి నీళ్లు వెళ్లడంతో నేతన్నకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి నష్టం విలువ అంచనా వేశారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు.

నిర్మాణ లోపం కారణంగానే..

డ్రైనేజీ కాలువలు సరిగ్గా నిర్మించకపోవడం వల్లే వర్షపు నీరు కాలువల్లో నిండి బయటకు వస్తోందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షం కారణంగా కూలిన ఇళ్లను గుర్తించి వాటికి నష్టపరిహారం అందిస్తామని అధికారులు బాధితులకు భరోసా ఇచ్చారు. చౌడేశ్వరి కాలనీలో గత కొన్ని ఏళ్లుగా సీసీ రోడ్డు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

'ఎస్సీ ఓట్లతో పీఠమెక్కి... వారిపైనే యుద్ధమా?'

ABOUT THE AUTHOR

...view details