అనంతపురం జిల్లా కదిరిలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నెల రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారి సంఖ్య 200 దాటినట్లు అధికారులు తెలిపారు. దీంతో నివారణ చర్యల్లో భాగంగా కంటెయిన్మెంట్ జోన్లలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారికి సేవలందించేందుకు వీలుగా కదిరి ప్రాంతీయ వైద్యశాలను కొవిడ్ ఆసుపత్రిగా మార్పు చేశారు. వాటితో పాటు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 250 పడకల కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారి కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను కొవిడ్ కేర్ సెంటర్లో స్థానిక శాసన సభ్యుడు సిద్ధారెడ్డి పరిశీలించారు. పాజిటివ్ లక్షణాలు వచ్చిన వారిని ఇతర ప్రాంతాలకు పంపకుండా.. కదిరిలోనే ఐసోలేషన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తహసీల్దార్ మారుతి తెలిపారు.
కరోనా బాధితుల కోసం.. కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు - కదిరి ప్రాంతీయ వైద్యశాల తాజా వార్తలు
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా అధికారులు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్పు చేశారు. బాధితుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను శాసన సభ్యుడు సిద్ధారెడ్డి పరిశీలించారు.
కొవిడ్ సెంటర్ పరిశీలించిన శాసన సభ్యులు