అనంతపురం నగర శివారులోని హార్మొనీ సిటీలో లక్ష చదరపు అడుగుల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చెప్పారు. హార్మోని సిటీ సంస్థ సీఎండీ రవికుమార్‌తో కలిసి ఐటీ పార్క్ ఏర్పాటు వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. 300 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ఐటీ పార్కుకు దసరా పండుగ రోజున ముఖ్యమంత్రి చేతులమీదుగా భూమిపూజ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి చెప్పారు.
ఐటీ కంపెనీలు ద్వితీయ స్థాయి నగరాలకు విస్తరిస్తున్నాయని, హార్మోని సిటీలో అన్ని సౌకర్యాలు ఉండటం, బెంగుళూరు నగరానికి అనంతపురం దగ్గరగా ఉండటం కలిసివచ్చే అంశమని పేర్కొన్నారు. కార్బన్ మెబైల్స్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఐటీ పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతలో ప్రతిపాదిత ఐటీ పార్కులో తమ సేవలు ప్రారంభించటానికి ఆరు ఐటీ కంపెనీలు ఆమోదం తెలిపాయని కార్బన్ మొబైల్స్, హార్మోని సిటీ సీఎండీ రవికుమార్ తెలిపారు.