ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడే కరోనా రోగుల కోసం తమ వంతుగా సహాయం చేయాలని ముందుకు వచ్చినట్లు ఎంటర్పెన్యూర్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అనంతపురంలో రోగుల కోసం 50.15 లక్షల రూపాయల విలువైన 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడికి ఇచ్చారు.
'ఎంటర్పెన్యూర్' పెద్ద మనసు.. 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత
కరోనా రోగుల కోసం తమ వంతు సహాయం చేయడానికి ఎంటర్పెన్యూర్ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారు. 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడికి అందజేశారు. వారిని కలెక్టర్ అభినందించారు.
50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత
ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా రోగుల కోసం సహాయం చేయాలని మాజీమంత్రి పరిటాల సునీత కోరగా... ఈ సహాయం చేస్తున్నట్లు ఎంటర్పెన్యూర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు చెప్పారు. ఆపత్కాలంలో ఆక్సిజన్ యంత్రాలను అందించటం పట్ల కలెక్టర్ గంధం చంద్రుడు ఆ సంస్థ ప్రతినిధులను అభినందించారు.
ఇదీ చదవండీ... ఇంకా అందని బెయిల్ పత్రాలు.. ఎంపీ రఘురామ సోమవారం విడుదలయ్యే అవకాశం!