అనంతపురం జిల్లా తాడిపత్రి రైల్వే వంతెన వద్ద రైలు కిందపడి ఇంజనీరింగ్ విద్యార్థి మణిపాల్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్పల మండలం కురగానిపల్లికి చెందిన రామచంద్రారెడ్డి కుమారుడు మణిపాల్ రెడ్డి తాడిపత్రిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతనికి మొదటి నుంచి చదువుపై ఆసక్తి లేదు. కళాశాలను తరచూ ఎగ్గొట్టేవాడు. 2ఏళ్లలో కేవలం ఐదు సబ్జెక్టుల్లోనే ఉత్తీర్ణత సాధించాడు. విషయాన్ని తండ్రికి చెప్పింది కళాశాల యాజమాన్యం. మణిపాల్ రెడ్డి తండ్రి కళాశాలకు వచ్చి కుమారుడిని బయటకు తీసుకెళ్లారు. బాగా చదువుకోవాలని మందలించాడు. దీన్ని అవమానంగా భావించిన మణిపాల్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు పట్టాలపై పడి ఉన్న అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు స్థానికులు. మార్గమధ్యలోనే మృతి చెందాడు.
చదువు ఒత్తిడి, అవమాన భారంతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య - student suicide news in ananthapuram
ఆ విద్యార్థికి చదువుపై ఆసక్తి లేదు. కళాశాలలో చేరినా తరచూ తరగతులు ఎగ్గొట్టేవాడు. లెక్చరర్లు మందలించినా వైఖరి మార్చుకోలేదు. పరిస్థితిని కుర్రాడి తండ్రికి చెప్పింది కళాశాల యాజమాన్యం. ఆగ్రహించిన ఆయన... కుమారుడిని మందలించాడు. తీవ్ర ఒత్తిడికి లోనైనా ఆ యువకుడు బలవన్మరణం చెందాడు.
తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య