అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురద కుంట గ్రామంలో లో టెన్షన్ తీగలపై హైటెన్షన్ తీగలు పడ్డాయి. పరిస్థితి గమనించిన శ్రీధర్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి... మెయిన్ ఆపేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటికే.. విద్యుదాఘాతం కారణంగా టీవీలతో పాటు మరికొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇదే ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ కో అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.
విద్యుత్ ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు - electrical accident at ananthapuram district latest news
అనంతపురం జిల్లా దురదకుంట గ్రామంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. లోటెన్షన్ తీగలు.. హై టెన్షన్ తీగలపై పడిన కారణంగా ఎలక్ట్రిక్ సామాన్లు కాలిపోయాయి. ఓ యువకుడికి గాయాలయ్యాయి.
విద్యుత్ ప్రమాదంలో ఇంజనీరింగ్ యువకుడికి తీవ్రగాయాలు