ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలో మరమగ్గాల తనిఖీ - ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు తాజా వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేనేతకు రిజర్వేషన్ చేసిన 11 రకాలను మరమగ్గాలపై తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేశారు.

Enforcement officers inspect the Power looms
మరమగ్గాలను తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

By

Published : Jan 29, 2020, 10:49 AM IST

మరమగ్గాలను తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

అనంతపురం జిల్లా ధర్మవరంలో అధికారులు మరమగ్గాలను తనిఖీ చేశారు. మరమగ్గాలపై చేనేత రకాలు తయారు చేస్తున్నారన్న ఫిర్యాదులపై.. చెన్నై, తిరుపతి నుంచి అధికారుల బృందం వచ్చి తనిఖీలు నిర్వహించింది. జిల్లా ఎన్​ఫోర్స్​మెంట్ అధికారి మనోహర్, జిల్లా డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ధర్మవరంలో 5 చోట్ల నిబంధనలు అతిక్రమించి 100 శాతం పట్టుతో చీరలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం చేనేతకు 11 రకాలు రిజర్వేషన్ చేసిందని.. వాటిని మరమగ్గాలపై తయారుచేస్తే కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details