మడకశిర మండలం చౌటపల్లి, మల్లినాయకనపల్లి, మడకశిరకు చెందిన విద్యార్థినులు... గౌడనహళ్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతులు ముగించుకొని ఆటోలో ఇళ్లకు బయలుదేరారు. వారి ఆటో మల్లినాయకనపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు... విద్యార్థినులను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తొమ్మిది మందిని హిందూపురం ఆస్పత్రికి పంపించారు.
ఆటో బోల్తా... 11మంది విద్యార్థినులకు గాయాలు - ananthapuram district crime news
అనంతపురం జిల్లా మల్లినాయకనపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం హిందూపురం తరలించారు.
![ఆటో బోల్తా... 11మంది విద్యార్థినులకు గాయాలు eleven students injured in a road accident in mallinayakanapalli ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10071543-264-10071543-1609414994469.jpg)
మడకశిరలో విద్యార్థినుల ఆటో బోల్తా