ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్, మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ఉన్న ప్రభుత్వ భూములను ఏపీఐఐసీ సీనియర్ బృందంతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటుకు సాధ్యసాధ్యాలను తెలుసుకున్నారు.
సత్యసాయి బాబా కొలువుదీరిన పుట్టపర్తిని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొస్తామని అన్నారు. 350 ఎకరాల్లో ఎలక్ట్రానికి క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.