అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ రూ. 6.50 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా కార్యాలయానికి విద్యుత్ సరఫరా (cut off power to the Kalyanadurg municipality) నిలిపివేశారు. డిసెంబర్ నెలాఖరులోగా బకాయిలు చెల్లిస్తాం.. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని విద్యుత్ అధికారుల్ని మున్సిపల్ అధికారులు కోరగా... లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని తెలిపారు.
తాజాగా రూ.15.50 లక్షల సీఎం ఎఫ్ఐ నిధులను నుంచి మున్సిపల్ అధికారులు ఇచ్చారు. అయితే అవి ప్రభుత్వం ఆమోదం పొందితేనే జమ అవుతాయని విద్యుత్ అధికారులు తెలిపారు.