అనంతపురం జిల్లా తలుపుల మండలం వేపమానిపేట రైతు భరోసా కేంద్రానికి రంగులు వేస్తున్న సమయంలో విద్యుదాఘాతం చోటు చేసుకోవడం వల్ల వ్యక్తి మృతి చెందాడు. బిహార్‌కు చెందిన మహమ్మద్ సద్దాం(26) భవనానికి రంగులు వేయడానికి వచ్చాడు. రంగులు వేసే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ సద్దాం విద్యుదాఘాతానికి గురై భవనం పైనుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన పెయింటర్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
నిర్లక్ష్యానికి మూల్యం.. నిండు ప్రాణం బలి - పెయింటర్ మృతి
నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా తలుపుల మండలం వేపమానిపేటలో విద్యుదాఘాతంతో పెయింటర్ మృతి చెందాడు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా రంగులు వేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
నిర్లక్ష్యానికి మూల్యం.. నిండు ప్రాణం బలి