అనంతపురం జిల్లా మడకశిర విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఒప్పంద కార్మికులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రైవేటీకరణను రద్దు చేయటంతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2020 అనే విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ శాఖను ప్రైవేటీకరణకు పాల్పడుతోందని విద్యుత్ జేఏసీ నాయకులు మండిపడ్డారు. బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.
'విద్యుత్ ప్రైవేటీకరణను రద్దు చేయాలి' - అనంతపురంలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
విద్యుత్ ప్రైవేటీకరణ రద్దు చేయటంతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ విద్యుత్ ఉద్యోగులు అనంతపురం జిల్లా మడకశిర విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.
'విద్యుత్ ప్రైవేటీకరణను రద్దు చేయాలి'