అనంతపురం జిల్లా మడకశిర విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులర్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాసంకల్ప యాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి తమను శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు దానిని నిలబెట్టుకోవాలని కోరారు. గురువారం జరిగే మంత్రివర్గ భేటీలో ఈ విషయం గురించి చర్చించాలని డిమాండ్ చేశారు.
మడకశిరలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన - మడకశిరలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా వార్తలు
తమను రెగ్యులరైజ్ చేయాలంటూ అనంతపురం జిల్లా మడకశిరలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. సీఎం జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

మడకశిరలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన