అనంతపురం జిల్లాలో నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 1044 గ్రామ పంచాయతీల్లో నాలుగు మినహా.. 1040 పంచాయతీలకు, 10 వేల 484 వార్డులకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిచారు. రెండు, మూడు విడతల్లో రాప్తాడు, కనగానపల్లి, ఆత్మకూరు, పుట్లూరు, తాడిపత్రి మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగినా ఓట్ల లెక్కింపు సమయంలో స్వల్ప ఘర్షణలు, ఇరువర్గాలు రాళ్లురువ్వుకోవటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
పోలీసుల అప్రమత్తత..
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు పక్కా ప్రణాళికతో ఎక్కడా ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ముందస్తుగా 32 వేల మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకొని స్వంతపూచీతో విడుదల చేశారు. వీరిపై గట్టి నిఘాపెట్టి ఎన్నికల భద్రత చర్యలు తీసుకున్నారు. కొందరు రిటర్నింగ్ అధికారులు గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వటానికి కావాలని జాప్యం చేసినట్లు... కొన్ని చోట్ల ఫలితాలు తారుమారు చేశారనే ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ సిబ్బంది కొన్నిచోట్ల సౌకర్యాల కోసం నిరసన తెలిపిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మెుత్తానికి ఈ సారి ఎన్నికల నిర్వహణ చాలా వరకూ ప్రశాంతంగానే జరిగింది. ఆదివారం పెనుకొండ డివిజన్లో నిర్వహించిన పోలింగ్‌తో.. జిల్లాలో పంచాయతీ, వార్డు ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక జిల్లాలోని 1040 గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచులు కొలువుదీరానున్నారు.
ఇదీ చదవండి:
శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాంటూ ల్యాబ్ టెక్నీషియన్ల డిమాండ్