రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పల్లెల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే మొదటి దశ ఎన్నికల్లో నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు కీలకపాత్ర పోషించారు.
రెండో దశ సమీపిస్తుండడంతో.. ఆయా ప్రాంతాల సర్పంచ్ అభ్యర్థుల కోరిక మేరకు ఉమామహేశ్వర నాయుడు గడపగడపకూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ ప్రచారానికి గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ పల్లెల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ.. ప్రచారం చేస్తున్నారు.