ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 25, 2020, 7:10 PM IST

ETV Bharat / state

వెల్డింగ్​ చేస్తుండగా ప్రమాదం… చెలరేగిన మంటలు

వాహనానికి వెల్డింగ్​ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న ప్లాస్టిక్​ బాక్స్​లు దగ్ధమయ్యాయి. పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని వాహన యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.

eicher vehicle gets fired while doing welding
పార్థసారధి నగర్​ వెల్డింగ్​ షాపు వద్ద జరిగిన ప్రమాదం

అనంతపురం జిల్లా ధర్మవరం పార్థసారధి నగర్​లో ఓ వాహనానికి వెల్డింగ్​ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అరటి కాయలు ఎగుమతులు చేసేందుకు వాహనంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్​ బాక్స్​లు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు రావడం వల్ల స్థానికులు భయాందోళన చెందారు. సమీపంలో ఉన్న నీటిని పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో రూ. 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని వాహన యజమాని వెంకటరమణ వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details