అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి గ్రామ సమీపంలోని సర్.సీ.వీ.రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మట్టి వినాయకుల వాడకంపై అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం మట్టి గణపతులను తయారు చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని 200 మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి 61 మట్టి విగ్రహాలు తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు. అద్భుతంగా ఉన్న మొదటి 5 విగ్రహాలకు కళాశాల ఛైర్మన్ బీ.వీ.భాస్కర్ రెడ్డి నగదు బహుమతి అందించారు. ప్లాస్టర్ ఆప్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక ప్రతిమలు వాడటం ద్వారా పర్యవరణం కలుషితమవుతుందని మట్టి వినాయకులనే ప్రతి ఒక్కరు వినియోగించాలని సర్.మట్సీట్.వీ. రామన్ విద్యార్థులు పేర్కొన్నారు.
మట్టి గణపయ్యలనే పూజిద్దాం..కాలుష్యాన్ని నివారిద్దాం..
సర్.సీ.వీ.రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మట్టి వినాయకుల వాడకంపై అవగాహన సదస్సుతో పాటు గణపయ్యల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
eenadu- etv held aawereness program about clay ganesh idol at sir c.v. raman engeneering college in ananthapur district
Last Updated : Aug 28, 2019, 10:36 AM IST