JC Brothers: జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు - TADPATRI
09:03 June 17
జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ తనిఖీలు
ED Ride on JC Prabhakar Reddy House: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈడీ తనిఖీ సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: