ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడ్ ఉల్లంఘనపై వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఈసీ చర్యలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈనెల 15న ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిషేదాజ్ఞలు జారీ చేసింది.

కోడ్ ఉల్లంఘన చర్యలు
కోడ్ ఉల్లంఘన చర్యలు

By

Published : Mar 13, 2020, 9:44 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించినందుకు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. ఈ నెల 15న ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రిలో కోడ్ ఉల్లఘించి ఈనెల 8న బట్టలు, చీరలు పంచినట్లు ఈసీకి అందిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కోడ్ ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చేస్తామని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details