ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పొదుపు సొమ్మును అప్పులో జమచేయకండి' - Dwarka Womens Dharna News in somandepalli

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని మాగేచెరువు గ్రామంలోని కెనరా బ్యాంకు వద్ద పొదుపు సంఘాల మహిళల ధర్నా చేపట్టారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఇచ్చిన రుణాలను పొదుపు ఖాతాల నుంచి రుణాలకు జమచేయడం నిలిపివేయాలని డిమాండ్​ చేశారు.

బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టిన డ్వాక్రా మహిళలు
బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టిన డ్వాక్రా మహిళలు

By

Published : Apr 29, 2020, 11:43 PM IST

డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలను పొదుపు ఖాతాల నుంచి రుణాలకు జమచేయడం నిలిపివేయాలని... మహిళలు బ్యాంకు ఎదుట బైఠాయించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని మాగేచెరువు గ్రామంలోని కెనరా బ్యాంకులో పొదుపు సంఘాల మహిళలకు సంబంధించిన రుణాలను... వారి పొదుపు ఖాతాల నుంచి నగదు జమ చేస్తున్నారని బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సున్నా వడ్డీకి సంబంధించిన నగదును మహిళల ఖాతాల్లోకి జమచేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సోమందేపల్లి మండలం వెలుగు ఏపీఎం రామాంజనేయులు, ఏరియా కొ-ఆర్డినేటర్ ప్రసాద్​, సోమందేపల్లి ఎస్​ఐ వెంకటరమణ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించటంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ వేళ.. బ్యాంకు ముందు మహిళలు ఇలా..!

ABOUT THE AUTHOR

...view details