ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని అదుపు చేయటం లాక్ డౌన్ వల్లనే సాధ్యం అవుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. వైద్యులకు, సిబ్బందికి రక్షణ చర్యలు తీసుకోవాలని, వారి సంక్షేమానికి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. పీపీఈ కిట్ల కొరత తీవ్రంగా ఉందని.. తక్షణమే వాటిని సమకూర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పీపీఈ, మాస్కులను తయారు చేయించాలని కోరారు. సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి అనంతపురంలో ఆయన మాట్లాడారు.
'కరోనా కట్టడికి లాక్డౌన్ కొనసాగింపు తప్పనిసరి' - live updates of corona virus in andhrapradesh
కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయాలంటే లాక్డౌన్ను మరింత కాలం కొనసాగించాలని కాంగ్రెస్, వామపక్ష పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అనంతపురంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్... సీపీఐ, సీపీఎం నాయకులతో సమావేశమయ్యారు.

'కరోనా కట్టడికి లాక్డౌన్ తప్పనిసరి'