అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని మద్యం దుకాణాలు కొత్త ధరలతో మధ్యాహ్నం తెరుచుకున్నాయి. మద్యం ధరలు అధికంగా పెరగడంతో రోజువారీ కూలీ పని చేసుకొని జీవనం సాగించే వారికి... మద్యం అందని ద్రాక్షగా మారింది. నిన్న మద్యం షాపుల వద్ద బారులు తీరిన జనం నేడు రాలేదు. మద్యం కోసం వచ్చిన అరకొర మందుబాబులకు ధరలు తెలపగానే చాలామంది వెనుదిరిగారు. మద్యం ధరలు అధికంగా ఉండడంతో ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో మద్యం షాపులు వెలవెలబోతున్నాయి. మడకశిర నియోజవర్గం చుట్టూ ఉన్న కర్ణాటక ప్రాంతంలో తక్కువ ధరలతో మద్యం దొరకడంతో చాలామంది అక్కడికి వెళ్తున్నారు.
పెరిగిన మద్యం ధరలు... వెనుదిరిగిన మందుబాబులు..!
రాష్ట్రం అంతటా మద్యం దుకాణాలన్ని మందుబాబులతో కళకళలాడుతుంటే.. అక్కడ మాత్రం వెలవెలబోతున్నాయి.పెరిగిన మద్యం ధరలతో మందుబాబుల జేబులు ఖాళీ అయ్యాయి. అసలే పనుల్లేక చేతిలో డబ్బుల్లేకపోయిన మందుపై ఆశపై వస్తే... రేట్లు అమాంతం పెంచటంతో అనంతపురం జిల్లా మడకశిరలో మద్యం ప్రియులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
due to heavy rate of wine drunkers not coming to shops in anantapur dst madakasira