ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షం.. ధ్వంసమైన విద్యుత్, పండ్ల తోటలు - అనంతపురం జిల్లా తాజా వార్తలు

రుతుపవనాలు కేరళను తాకిన వేళ....రాష్ట్రంలోనూ వాతావరణం చల్లబడింది. పలుచోట్ల వర్షాలు పడ్డాయి. గాలివానకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుందుర్పి మండలంలో గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

due to Heavy rains electricity, orchards destructive  in kalyanadurgam in ananthapuram district
due to Heavy rains electricity, orchards destructive in kalyanadurgam in ananthapuram district

By

Published : Jun 2, 2020, 12:17 PM IST

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలోని వ్యవసాయ సబ్ డివిజన్​లో మంగళవారం కురిసిన వర్షానికి చెక్ డ్యాంలు నిండాయి. కళ్యాణదుర్గం, కుందుర్పి, కంబదూరు, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లోని పలు వాగులు ప్రవహించాయి.

కళ్యాణదుర్గం మండలం దురద కుంట శివార్లలో ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, పండ్ల తోటలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉద్యాన అధికారులు పంట నష్టం అంచనా వేసి... పరిహారం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండ:కరోనా కాటు.. మాడిన క్యాబేజీ పంట

ABOUT THE AUTHOR

...view details