అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం సాయినగర్ కాలనీలో... కరోనా లక్షణాలతో ఒక మహిళ మృతి చెందడం మరో ఐదుగురికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు సాయినగర్ కాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించి... రాకపోకలు నిలిపివేశారు. ధర్మవరం ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున బుధవారం రాత్రి రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. నిత్యావసర సరుకులు వాలంటీర్ల ద్వారా అందజేస్తామని పేర్కొన్నారు.
రెడ్‌జోన్‌గా సాయినగర్ కాలనీ - అనంతపురం జిల్లా తాజా వార్తలు
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సాయినగర్‌ను అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కరోనాతో మృతి చెందిన మహిళ ద్వారా మరో ఐదుగురికి వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
![రెడ్‌జోన్‌గా సాయినగర్ కాలనీ due to corona Sayanagar Colony as Red Zone in dharmavaram town in ananthapuram disrict](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7469156-953-7469156-1591249844841.jpg)
due to corona Sayanagar Colony as Red Zone in dharmavaram town in ananthapuram disrict