పుట్టపర్తిలోని రెడ్‌జోన్‌లో డీఎస్పీ పర్యటన - puttaparthi red zone news
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని రెడ్‌జోన్ ప్రాంతంలో డీఎస్పీ రామకృష్ణ పర్యటించారు. రెడ్‌జోన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
పుట్టపర్తి రెడ్‌జోన్‌లో డీఎస్పీ పర్యటన
పుట్టపర్తిలోని రెడ్‌జోన్ ప్రాంతంలో డీఎస్పీ రామకృష్ణ పర్యటించారు. స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని డీఎస్పీ కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణ కోసం సహకరించాలన్నారు. రెడ్‌జోన్ ప్రాంతంలోని 700 కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.