కంటైన్మెంట్ జోన్లో పర్యటించిన డీఎస్పీ - putlure corona positive cases news in telugu
పుట్లూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో... ఆ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. డీఎస్పీ శ్రీనివాసులు కంటైన్మెంట్ జోన్‌ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కంటైన్మెంట్ జోన్‌ను పర్యటించిన డీఎస్పీ
అనంతపురం జిల్లా పుట్లూరులోని బీసీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావటంతో... అధికారులు ఆ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. డీఎస్పీ శ్రీనివాసులు పుట్లూరులో కంటైన్మెంట్ జోన్‌ను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందజేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనవసరంగా రోడ్లపై తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామంలో నిర్ణీత వేళల్లో మాత్రమే నిత్యావసర సరకులకు అనుమతించాలని ఆదేశించారు.