ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భూ సమస్యే హత్యలకు కారణం.. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం' - అనంతపురం జిల్లా యల్లనూరులో హత్యలు వార్తలు

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం ఆరవేడు గ్రామంలో జరిగిన ఘటనపై తాడిపత్రి డీఎస్పీ మాట్లాడారు. భూ సమస్యే హత్యలకు కారణమని వెల్లడించారు.

dsp chaitanya
dsp chaitanya

By

Published : Jun 20, 2021, 3:09 PM IST

రాజగోపాల్, నారాయణప్పకి నాగేశ్​తో భూ సమస్య ఉందని తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. ఈ క్రమంలోనే రాజగోపాల్, నారాయణప్ప హత్యకి గురయ్యారన్నారు. హత్య జరిగిన అనంతరం ఆరవేడు గ్రామంలో ఇద్దరు ఎస్సైలు, 40 మంది పోలీస్ సిబ్బందితో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. రాత్రి 2 గంటల సమయంలో బాధిత వర్గం మహిళలు.. తమకు న్యాయం జరగాలని పెట్రోల్ బాటిళ్లతో వచ్చి.. మీద పోసుకొని నిప్పు అంటించేందుకు ప్రయత్నించారని.. వారిని సముదాయించి.. న్యాయం చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. అక్కడే ఉన్న కొంతమంది నిందితుల ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపు చేశారని డీఎస్పీ తెలిపారు. నిప్పు అంటుకున్న ఇళ్లను ఫైర్ ఇంజన్ సాయంతో ఆర్పివేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అదనపు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ చైతన్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details