ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు' - తాడిపత్రి వార్తలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డీఎస్పీ చైతన్య సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

dsp chaitanya comments
డీఎస్పీ చైతన్య సమావేశం

By

Published : Mar 8, 2021, 5:30 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డీఎస్పీ చైతన్య సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా వాహనాలతో ర్యాలీ నిర్వహించినందుకు తెదేపా నేత పవన్ రెడ్డిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాడిపత్రి, గుత్తి పురపాలికల్లో 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటివరకు సమస్యలు సృష్టించే అవకాశమున్న 350 మందికి నోటీసులు జారీ చేశామన్నారు.

ఇప్పటికే లాడ్జిల యజమానులు..టీ బంకులకు ఆదేశాలు జారీ చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. పట్టణంలో 10న సాయంత్రం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. మొత్తం ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ఎస్ఐ స్థాయి అధికారిని నియమించామని చెప్పారు. ఓటర్ ఐడి కార్డు చూపిన వారినే మాత్రం పట్టణంలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల వేళ ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని..అందుకు తగిన చర్యలు చేపట్టామని అన్నారు.


ఇదీ చదవండి:అనంతపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాల జోరు

ABOUT THE AUTHOR

...view details