అనంతపురం జిల్లా రాయదుర్గంలో మద్యం షాపులకు మందుబాబులో పెద్ద సంఖ్యలో వచ్చారు. మద్యం షాపుల వద్ద ప్రజలు ఎగబడిన కారణంగా.. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు సివిల్ పోలీసులు వారిని కట్టడి చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
అయితే మరో పక్క మద్యం కోసం భౌతిక దూరం పాటించకుండా ఒకరికొకరు తోసుకుంటూ ఉండడంతో కరోనా మహమ్మారి వస్తుందోమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు.. ధరలు 25% పెంచినా కొనుగోళ్లకు ప్రజలు ఎగబడుతున్నారు.