రైలులో మాదక ద్రవ్యాలు తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరులో అనంతపురం జిల్లా హిందూపురం ఆర్పీఎఫ్ (R.P.F.) సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగులో తనిఖీ చేయగా 640 గ్రాముల మాదక ద్రవ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యం విలువ 3 కోట్ల 20 లక్షల రూపాయలు ఉంటుందని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.
రూ.3 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం..నిందితుడి అరెస్టు - Drugs worth over Rs 3 crore seized by RPF
మాదకద్రవ్యాలు తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరులో హిందూపురం ఆర్పీఎఫ్ (R.P.F.) సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 3 కోట్ల 20 లక్షల విలువైన 640 గ్రాముల మాదక ద్రవ్యాల్ని స్వాధీనం చేసుకున్నారు.
రూ.3 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం-నిందితుడి అరెస్టు
ఈనెల ఒకటో తేదీన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి ప్రవర్తనపై అనుమానంతో..హిందూపురం ఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. బెంగళూరులో సిబ్బందిని అప్రమత్తం చేశారు. రైలు..బెంగళూరు స్టేషన్‌కు సమీపిస్తుండగానే..అనుమానితుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది చుట్టుముట్టి పట్టుకున్నారు.
ఇదీ చదవండి:తీవ్రవాదులతో చేతులు కలిపిన వైకాపా నేతలు: నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి