Workers Went on Strike and Stopped the Water Supply:ఆ కార్మికులంతా దశాబ్దాలుగా పనిచేస్తున్న చిరు ఉద్యోగులు. వారంతా వేతనాలు పెంచమని అడగటంలేదు.. తమకు రావల్సిన వేతన బకాయిలు చెల్లించండి మహా ప్రభో.. కుటుంబాలను పోషించుకోలేక పోతున్నామని మొరపెట్టుకుంటున్నారు. అయినా ప్రభుత్వం నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించలేదు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి పీఎఫ్ జమ చేయలేదు.
Drinking Water Problem: నీటి కోసం ఎదురుచూపులు.. పట్టించుకునే వారే కరువయ్యారు..
Employees PF Accounts have not been Credited:ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహాన్ని సత్యసాయి, శ్రీరామిరెడ్డి పథకాలు తీరుస్తున్నాయి. ఈ పథకాల ద్వారా సుమారు 16 వందల గ్రామాలకు తాగునీరు అందుతోంది. శ్రీ సత్యసాయి తాగునీటి పథకంలో 5 వందల 72 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ఐదు నెలల నుంచి జీతాలు అందడం లేదు. కార్మికుల వేతనాలు నుంచి మినహాయించిన పీఎఫ్ సొమ్మును 18 నెలల నుంచి వారి ఖాతాల్లో జమ చేయడం లేదు. కలెక్టర్‌కి ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదంటూ కార్మికులు వాపోతున్నారు. విన్నపాలతో విసిగిపోయిన కార్మికులు.. నేటి నుంచి సమ్మెబాట పడుతామని తెలిపారు.
Workers Dharna in front of Collectorate:శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో దాదాపు 6 వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో.. గత నెలలో కలెక్టర్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు. పట్టించుకోకపోవడంతో కడుపు మండిన కార్మికులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నారు. అయినా స్పందన లేకపోవడంతో.. ఈ నెల 19 అర్ధరాత్రి నుంచి తాగునీటి పంపులు నిలిపివేసి.. సమ్మెబాట పట్టారు. వేతనాలు ఇచ్చే వరకు సమ్మె విరమించేదే లేదంటూ తేల్చి చెబుతున్నారు.