అనంతపురం జిల్లా కుందుర్పిలోని ప్రభుత్వ పాఠశాలలో మంచి నీటి సమస్య.. విద్యార్థులను వేధిస్తోంది. దాతలు మంచినీటి శుద్ధి యంత్రాన్ని విరాళంగా ఇచ్చినా.. అవసరమైనంతగా సరిగా నీరు అందటంలేదు. బొట్లుబొట్లుగా వస్తున్న నీటినే విద్యార్థులు పట్టుకుని తాగుతున్నారు. మరుగుదొడ్లు వాడాలంటే ఇక అంతే.. పాఠశాలకు కొంత దూరంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుంచి నీటిని తెచ్చి వాడుకుంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇకనైన అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.
తాగునీటి సమస్యతో విద్యార్థుల అవస్థలు
అనంతపురం జిల్లా కుందుర్పిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాగేందుకు నీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీరు