Drinking Water Problem: అనంతపురం జిల్లా గుంతకల్లులోని దోనిముక్కల రోడ్డులో నివసిస్తున్న మహిళలు... తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. దాదాపు 4 వందల కటుంబాలు ఉన్న తమ కాలనీలో.. 15 రోజులైనా నీటిని పంపడం లేదని వాపోయారు.
గొంతెండుతోంది.. మంచి నీళ్లు మహాప్రభో.. - Drinking Water Problem Guntakallu
Water Problem: తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ.. అనంతపురం జిల్లా గుంతకల్లులోని దోనిముక్కల రోడ్డులో నివసిస్తున్న మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. పదిహేను రోజులైనా నీటిని పంపడం లేదని.. తాగునీరు లేక అల్లాడిపోతున్నామని వాపోయారు.
Drinking Water Problem
15 రోజుల నుంచి తాగు నీరు లేక ఆల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా.. పట్టించుకున్న నాథుడే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేసినప్పుడు నీరు ఇచ్చినా.. తరువాత మళ్లీ షరా మామూలేనని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమకి శాశ్వత నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :Weather Report: వాయుగుండంగా మారిన అల్పపీడనం... రానున్న 24 గంటల్లో