అనంతపురం జిల్లా కదిరి పట్టణం కుటాగుళ్లలో 15 రోజులుగా తాగునీరు రావడంలేదు. లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఫలితంగా... గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం మహిళలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
స్థానిక నాయకులు కొందరు మహిళలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అత్యవసరమైన నీటిని సరఫరా చేయడంలో చొరవ చూపకుండా తమకు సర్దిచెప్పడంతో స్థానికులు వాళ్లను పంపించేశారు. మున్సిపల్ అధికారులు వచ్చి నీరందిస్తామని హామీ ఇవ్వకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.