ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొడుగు ఉంటేనే మద్యం.. పాటిస్తున్నారు భౌతిక దూరం..! - drinkers went to wine shops with umbrellas in ananthapuram news

మద్యం దుకాణాల వద్ద మందుబాబులు భౌతిక దూరం పాటించేలా అనంతపురం అధికారులు వినూత్న ఆలోచన చేశారు. గొడుగులు ఉంటేనే మద్యం అమ్మేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మద్యం ప్రియులు గొడుగులతో దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు.

గొడుగు ఉంటేనే మద్యం.. పాటిస్తున్నారు భౌతిక దూరం..
గొడుగు ఉంటేనే మద్యం.. పాటిస్తున్నారు భౌతిక దూరం..

By

Published : May 7, 2020, 11:28 PM IST

అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాల జోరు తగ్గడం లేదు. ధరలు పెరిగినా మద్యం ప్రియులు లిక్కర్​ షాపులకు క్యూ కడుతున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. ఈక్రమంలో అధికారులు వినూత్న ఆలోచన చేశారు. మద్యం కావలసిన వారు గొడుగుతో రావాలని సూచిస్తున్నారు. గొడుగు లేకుంటే మద్యం అమ్మబోమని తేల్చిచెపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details