అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఆర్యపేట వీధిలో చిన్నపాటి వర్షం వస్తేనే మురుగు చేరి దారి మొత్తం మూసుకుపోతోంది. కొన్నేళ్లుగా ఆ వీధి వాసులకు ఈ బాధ తప్పటం లేదు. ఆ వీధికి అది ప్రధాన మార్గం కావడంతో వీధి వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నాలుగు రోజులు ఎండకు ఎండిన తర్వాతే తిరిగి ఆ మార్గంలో రాకపోకలకు అవకాశం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులకు చెప్పినా నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారని కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవచూపి ఈ మురుగు కాలువల పట్ల శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
వానోస్తే ఆ వీదంతా బురదే... - drinage issue in anantapur dst
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఆర్యపేట వీధి వర్షం వస్తే రహదారి ఆధ్వానంగా మారుతోంది. నిత్యం రాకపోకలు సాగించే ఆ వీధి వైపు బురద ఉండటంతో ప్రయాణం సాగించే పరిస్థితి లేదని వాహనచోదకులు అంటున్నారు.

drinage issue in anantapur dst madakasira