అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. దాదాపు 80 రోజుల తరువాత దేవాదాయశాఖ ఆదేశాలతో ఇవాళ్టి నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా భక్తులు మాస్కులు, శానిటైజర్ వెంట తెచ్చుకోవటంతో పాటు భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన చర్యలను ఆలయ అధికారులు చేపట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాల అనంతరం దర్శనానికి అనుమతించారు. ఆరాధ్య దైవం నారసింహుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు దీరారు.
నారసింహుని దర్శనం... పునఃప్రారంభం - కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వార్తలు
కదిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. కరోనా వేళ భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఆలయ అధికారులు.
kadiri sri lakshmi narasimha swami temple