ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్మికులకు అండగా దాతలు - కదిరిలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ మదన్ మోహన్

కరోనా వైరస్ కట్టడిలో ముందు వరుసలో ఉంటున్న కార్మికులకు పలువురు దాతలు అండగా నిలచి చేయూతనిస్తున్నారు. కదిరిలోని ప్రముఖ వైద్యుడు మదన్​మోహన్​ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దినసరి కూలీలకు ఏపీ మెప్మా ప్రతినిధులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ananthapuram district
పారిశుద్ధ్య కార్మికులకు అండగా దాతలు

By

Published : May 16, 2020, 1:48 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో ప్రాంతీయ వైద్యశాల పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రముఖ వైద్యుడు మదన్​మోహన్ నిత్యావసర సరకులు, కూరగాయలను పంపిణీ చేశారు. కుటుంబాలను పక్కన పెట్టి, భయంకరమైన కరోనా వైరస్​కు జంకకుండా సేవలందిస్తున్న కార్మికులకు తమ వంతు సహాయం చేసిన వైద్యుడిని తహసిల్దార్ మారుతి అభినందించారు. పట్టణంలోని దినసరి కూలీలకు,పేదలు, బీడీ కార్మికులకు ఏపీ మెప్మా ప్రతినిధులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details